కృష్ణా: 10వ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను, నందివాడ మండలం వెన్ననపూడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవ్, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రాము మంగళవారం అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ, మంచి ఫలితాలు నమోదు చేస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలని సూచించారు.