NLG: భువనగిరిలోని వివేరా హోటల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలను చర్చించారు.