HYD: సికింద్రాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును రైల్వే పోలీసులు రట్టు చేశారు. ఒడిశా నుంచి పూణేకు 14 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, రూ. 7.16 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో ట్రిప్‌కు రూ.7 వేల ఒప్పందంతో నిందితుడు ఈ అక్రమ రవాణాకు పాల్పడగా, ప్రధాన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.