JGL: కోరుట్ల పట్టణంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు శాంతి సమావేశం నిర్వహించారు. సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని హెచ్చరించారు. గోవుల రక్షణ పేరుతో వాహనాలను అడ్డుకోవద్దని తెలిపారు.