VSP: దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న గోస్తని గడ్డ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మురుగునీరు నిలిచిపోవడంతో ఇళ్లలోకి చేరుతున్న సమస్యపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించి యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. వార్డు అధ్యక్షుడు తమ్మిన సూరిబాబు ఆధ్వర్యంలో పూడికతీత పనులు చేపట్టి నీటి ప్రవాహాన్ని ఇవాళ సాఫీ చేశారు.