ప్రముఖ బయోటెక్ సంస్థ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తన వారసత్వాన్ని కొనసాగించే అంశంపై స్పష్టత ఇచ్చారు. తన మేనకోడలు క్లెయిర్ మజుందార్ భవిష్యత్తులో సంస్థను నిర్వహిస్తారని తెలిపారు. అయితే తాను ఇప్పటికిప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవట్లేదని కిరణ్ మజుందార్ స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే దశలవారీగా బాధ్యతల మార్పు జరుగుతుందని ఆమె వెల్లడించారు.