VKB: రైతులు ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ ఉద్యానవన పంటల సాగుతో అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి లాభదాయకమైన ఉద్యాన పంటల వైపు మళ్లాలని సూచించారు.