VSP: భీమిలి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బోడమెట్టపాలెం కమ్యూనిటీ హాల్లో ‘కిశోర వికాసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర బాలికలకు లైఫ్ స్కిల్స్, స్వీయ అవగాహన, లక్ష్య నిర్ధారణపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆర్. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. బాలికల సాధికారత, వ్యక్తిత్వ వికాసానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.