NLG: ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం దిగుమతిలో మిల్లర్ల మోసాలను అరికట్టాలని కోరుతూ రైతు సంఘం నాయకులు కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. తాలు, తరుగు పేరుతో అదనపు కటింగులు చేస్తూ మిల్లర్లు రైతులను నిలువునా ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.