SRCL: రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని సిరిసిల్ల PACS ఛైర్మన్ బండి దేవదాస్ అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేవదాసు మాట్లాడుతూ.. రైతులకు ఏ సమస్య ఉన్న మమ్ములను నేరుగా సంప్రదించాలన్నారు. వైస్ ఛైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, సభ్యులు ఉన్నారు.