SRCL: టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని మండల వైద్యాధికారి వేణుమాధవ్ అన్నారు. మండలంలోని ఎనగల్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం చందుర్తి పీహెచ్సీ వైద్య సిబ్బంది టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభారాణి, ఎంఎల్ హెచ్పీ నవ్య జ్యోతి ఉన్నారు.