సత్యసాయి: ధర్మవరం పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని శివానగర్, శాంతినగర్, రామ్‌నగర్ సహా పలు కాలనీల్లో నీటి సరఫరా సరిగా లేదని, కొన్నిచోట్ల 8 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందుతోందని వివరించారు.