కరీంనగర్ జిల్లాలో DMAC ఛైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధ్యక్షతన అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 106 మంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కమిటీ ఆమోదించింది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.