NZB: భీంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయడంతో ఆనందోత్సాహాలు పట్టణంలో బీజేపీ నాయకులు, కార్య కర్తలు సంబరాలు జరిపారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పార్టీకి వస్తున్న ప్రజాదరణపై హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.