MHBD: జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ ఆదేశాల మేరకు మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ అనిల్ ఇవాళ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి, సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.