కోనసీమ: మండల కేంద్రమైన ఆలమూరు నంచి జొన్నాడ వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుపై మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శరవణ ఫైబర్స్ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో మండపేట, కొత్తపేట ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది.