MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని చింతలపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి వేళ నడిరోడ్డుపై కారు నిలపడంతో అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కారును పక్కకు తీయమన్న పట్టించుకోని పరిస్థితి. పోలీసులు తక్షణమే స్పందించి రోడ్డుపై నిలిపిన కారు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.