MBNR: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైనచర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ పడకూడదని ఎస్పీ జానకి పోలీసులను ఆదేశించారు. రూరల్ పోలీస్‌లకు నిర్వహించిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రతపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు పోలీస్ సిబ్బంది చురుకుగా పనిచేయాలని ,పోలీసులు ప్రజలకు రోల్ మోడల్‌గా నిలవాలని ఆమె సూచించారు.