JN: జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సక్సెషన్, మ్యుటేషన్, డేటా సవరణ వంటి అంశాల్లో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు.