NRML: ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం నిర్మల్లో ‘రైతు వారోత్సవాలు’ నిర్వహించారు. రెండో రోజున ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన అధికారిణి అలియా ఫాతిమ మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సుదీర్ఘకాలం ఆదాయం ఇచ్చే పంట అని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.