ADB: ఉద్యోగుల పేరిట మోసం చేసేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని 2 టౌన్ CI నాగరాజు మంగళవారం తెలిపారు. ట్రేడింగ్ పేరుతో, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి రూ.కోటి 70 లక్షలను దోచుకున్న సల్మాన్ అనే నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన గుడూరు ఉమారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.