VZM: టెన్త్ ఫలితాల్లో జిల్లా టాప్-3 స్థానంలో నిలవడం గర్వకారణమని రాష్ట్ర ఉపాద్యాయ సంఘం (STU) జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు అన్నారు. మంగళవారం స్దానిక అమర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ఒకవేళ అలా నిర్వహించాల్సి వస్తే టీచర్లకు ఆర్థిక సెలవులు లేదా ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.