SDPT: తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత మంగళవారం జగదేవపూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో నూతనంగా వెలసిన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెద్దమ్మ తల్లి దయతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల దీవెనలే తమ పార్టీకి అసలైన బలమని అన్నారు.