NTR: వీరులపాడు మండలం పొన్నవరం క్రాస్ రోడ్డులో ఎస్సై అభిమన్యు తన బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతని వద్ద 1 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి అల్లూరు గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.