KNR: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలోని అమ్మ ఫంక్షన్ హాల్ (నియోజకవర్గ స్థాయి)లో ఆయిల్ పామ్ అవగాహనపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.