NGKL: చారకొండ మండలం, ఎర్రవల్లి తండా, గ్రామస్థుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 155వ రోజుకు చేరాయి. డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి, తమ ఇళ్లు, భూములను ముంపు నుంచి రక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 5 నెలలుగా నిరంతరాయంగా దీక్షలు చేస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.