మధ్యప్రదేశ్ బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఏనుగులు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. తాజాగా, మరో మూడు ఏనుగులు మరణించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 3 రోజుల్లోనే 10 ఏనుగులు చనిపోయాయి. విషపూరిత పదార్థాలు తీసుకోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలో వస్తేనే వెల్లడవుతాయని వెల్లడించారు.