SRD: సదాశివపేట మండలం సూరారం గ్రామంలోని హజ్రత్ ఖాజే బందే నవాజ్ దర్గా 36వ ఉర్సు ఉత్సవ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా జరిగాయి. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఖవాలీ కార్యక్రమాలు ముస్లింలు నిర్వహించారు. ఇందులో టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.