MDK: వానాకాలం పంటల సాగులో నకిలీ విత్తనాలు అమ్మకం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై యాదగిరి, ఏవో గంగమల్లు హెచ్చరించారు. తన కార్యాలయంలో విత్తన డీలర్ల సమావేశం నిర్వహించారు. విత్తనాల దుకాణాలను మండల స్థాయిలో తనిఖీలు చేయడం జరుగుతుందని వివరించారు. సీజన్‌కు సరిపడా నాణ్యమైన విత్తనాలను సిద్ధం చేయాలన్నారు.