మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ల వ్యవహారం ఎన్డీఏ కూటమిలో చర్చనీయాంశమైంది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు సంబంధించిన పోస్టర్లు ముంబైలో కలకలం రేపుతున్నాయి. ముంబై బీజేపీ కార్యాలయం దగ్గర నవంబర్ 23న దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. ‘‘నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్’’ అంటూ పోస్టర్లు వెలిశాయి. కాగా నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.