NRML: వెంకటాపూర్ కాలనీలో మహాగణపతి, లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అంగారక సంకష్ట చవితిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో గణపతి హోమం వేద పండితులు అనురాగ్ శర్మ ఆధ్వర్యంలో గణపతి అభిషేకం, గణపతి హోమం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు.