GNTR: రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో థియేటర్ల రక్షణకు సంబంధించి పలు కీలక వినతులను సమర్పించారు.