చిన్నతనంలో ప్రేమ, ఆప్యాయతలకు దూరమైన పిల్లలకు భవిష్యత్తులో మరణ గండం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. జ్యూరిచ్ పరిశోధన ప్రకారం.. అనురాగం కరువైన వారిలో మరణించే అవకాశం 48 శాతం అధికంగా ఉంది. పిల్లల ఎదుగుదలలో మానసిక సాన్నిహిత్యం ఎంతో కీలకమని, సరైన సంరక్షణ లేకపోతే వారి జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.