MNCL: వ్యవసాయ సాగులో శాస్త్రీయ విధానాలు అవలంబించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ రైతు వారంలో భాగంగా మంగళవారం చెన్నూర్‌లో పంటల సాగుపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంట సాగు కాకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని తెలిపారు.