ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత ఐడీఓసీలోని డీసీఓ, ఏడీఎస్ఎల్ఆర్ కార్యాలయాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ రిజిస్టర్లను, సిబ్బంది హాజరును క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు సేవలను వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు. క్రమశిక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.