KNR: సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పర్సన్ ఇంఛార్జ్‌గా బిల్లా వెంకట్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 12మంది డైరెక్టర్లు పర్సన్ ఇన్ఛార్జ్ మెంబర్లుగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది వీరి పదవి కాలం పూర్తి కాగా, మరోసారి ఆరు నెలలు పొడిగించారు. తరువాత ప్రత్యేక అధికారి పాలన సాగింది.