ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించిన సాయి స్మృతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.