ADB: నేరడిగొండ మండలంలోని రాజుర గ్రామంలో చెరువు నిర్మాణంతో భూమి కోల్పోయిన రైతులకు మంగళవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నష్ట పరిహారం అందజేశారు. గత BRS ప్రభుత్వ హయాంలో 50 శాతం నిధులు విడుదల అయ్యాయని పేర్కొన్నారు. మిగతా నష్టపరిహారాన్ని విడుదల చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కోరగా రూ.1 కోటి 18 లక్షల నిధులు విడుదల అయ్యాయని తెలిపారు.