SRCL: ఈనెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న PM మోడీ బహిరంగ సభని విజయవంతం చేయాలని బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నిర్వహిస్తున్న హిందూ ఏక్తాయాత్రను కూడా విజయవంతం చేయాలన్నారు.