ఊపిరితిత్తుల లోపల వాపు రావడం లేదా మచ్చలు ఏర్పడటం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అలాంటివారు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా వ్యాయామం, ఈత కొట్టడం చేయండి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. బెర్రీ పండ్లు, జామకాయలు, ఆకుకూరలు వంటి ఆహారం తీసుకోండి. ఇవి ఊపిరితిత్తులలో వాపును తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి.