MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 6 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 6న మహబూబాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ వారితో ఫీల్డ్ విజిట్, 7న మహబూబాబాద్ జిల్లా ఎస్టీ సంబంధిత కేసుల విచారణ, 8న రైతులకు స్ప్రేయర్స్ పంపిణీ, 9న గిరిజన ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లనున్నారు.