RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల వేడుకల్లో భాగంగా, చేవెళ్లలోని అట్లాస్ ఫంక్షన్ హాల్లో రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు.