SRPT: గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులతో డీఎస్పీ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. వ్యాపారులు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని, షాపుల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విలువైన నగలను సేఫ్ లాకర్లలోనే ఉంచాలన్నారు. రాత్రి వేళల్లో పోలీస్ బీట్ పెంచామని, ముందస్తు జాగ్రత్తలతోనే నేరాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు.