SRPT: కోదాడ పట్టణంలోని పశు వైద్యశాలలో ఈరోజు ఓ గొర్రెకు పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెంలో ఓ గొర్రె తొంటి జాయింట్ పగిలిపోగా, వైద్యులు పెంటయ్య, చంద్రమోహన్ రాడ్లు అమర్చి ఆపరేషన్ చేశారు. సర్జరీ తర్వాత గొర్రె వెంటనే లేచి నిలబడటంతో యజమాని సంతోషం వ్యక్తం చేశారు.