NRML: సమానత్వం కారల్ మార్క్స్ సిద్ధాంతాలతోనే సాధ్యమని సీపీఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నూతన్ కుమార్ అన్నారు. ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ 209వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో ఉన్న సీపీఎం గద్దె వద్ద కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఉన్నారు.