SRPT: ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్నగర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ పశ్య సుబ్బరామి రెడ్డి సూచించారు. గడ్డి వాములు, ఎండిన చెత్త, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి కారణాలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.