KMR: ధాన్యం సేకరణలో లారీల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ అడిషనల్ పీడీ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. మంగళవారం బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని ఆమె దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.