శాకాహారులకు పనీర్ మంచి ప్రోటీన్. అయితే దీనిని అతిగా వేయించడం వల్ల పోషకాలు తగ్గి కొవ్వు పెరుగుతుంది. రోజుకు 100-150 గ్రాముల లోపే పనీర్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కూరగాయలతో కలిపి తింటే మరింత ప్రయోజనం ఉంటుంది. తాజా పనీర్ ఎంచుకుని, సరైన పద్ధతిలో వండుకుంటేనే శరీరానికి పూర్తిస్థాయిలో ప్రోటీన్ అందుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.