రక్తహీనతతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహార నియమాలతో దానిని దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా శనగలు, బెల్లం కలిపి తింటే హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది. ఐరన్ ఒంటికి పట్టాలంటే విటమిన్-సి అధికంగా ఉండే మామిడి, జామ వంటి పండ్లు తీసుకోవాలి. అలాగే రోజూ పప్పుధాన్యాలు, పెరుగు లేదా లస్సీని డైట్లో చేర్చుకుంటే అలసట తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.