నిన్న ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్(5.30%), రిలయన్స్(2.24%) షేర్లు అదరగొట్టాయి. రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ రంగాలు రాణించగా, భారతీ ఎయిర్టెల్, TCS వంటి ఐటీ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. దేశీయ సంస్థాగత మదుపర్లు(DII) సుమారు రూ.4,764 కోట్ల విలువైన కొనుగోళ్లు చేసి మార్కెట్‌కు అండగా నిలిచారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు మొగ్గు చూపినా, దేశీయ కొనుగోళ్లతో సూచీలు నిలబడ్డాయి.